close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఇద్దరిలో చిరు సోదరి ఎవరు?

తమిళంలో విజయవంతమైన ‘వేదాలం’ తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా రీమేక్‌ కాబోతోంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘ఆచార్య’ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి మేకప్‌ టెస్టుల్లోనూ పాల్గొన్నారు. ఈ చిత్రంకోసం ఆయన గుండుతో కనిపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై చిత్రబృందం కసరత్తులు చేస్తోంది.

ఈ కథలో కథానాయకుడి చెల్లెలి పాత్ర కీలకం. ఆ పాత్ర కోసం సాయి పల్లవి, కీర్తి సురేష్‌లని పరిశీలిస్తున్నారు. మరి చిరుకి చెల్లెలిగా కనిపించే అవకాశం ఇద్దరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి. సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’, ‘విరాటపర్వం’ చిత్రాలతో సందడి చేయబోతోంది. కీర్తి సురేష్‌ ‘రంగ్‌దే’లో నటిస్తోంది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘సర్కార్‌ వారి పాట’లోనూ ఆడిపాడబోతోంది. ఆమె నటించిన ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ త్వరలోనే విడుదల కాబోతున్నాయి. 
 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.