
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రకథానాయకుల్లో వెంకటేశ్ ఒకరు. ఆయన కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాల్లో ‘ధర్మచక్రం’ ఒకటి. 1996 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బుధవారంతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సురేశ్ కృష్ణ దర్శకత్వం శైలి, వెంకటేశ్ నటన, ఎం.ఎం.శ్రీలేఖ అందించిన స్వరాలు ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. వెంకటేశ్ తండ్రి పాత్రలో ప్రతినాయకుడిగా నటించిన గిరీశ్ కర్నాడ్ నటన ఈ సినిమాకు మరో ప్రత్యేకత.
కథేంటి: రాకేశ్(వెంకటేశ్) ఒక న్యాయవాది. అతడి తండ్రి మహేంద్ర(గిరీశ్ కర్నాడ్) పేరున్న రాజకీయ నాయకుడు. తల్లి శారద(శ్రీవిద్య). సురేఖ(ప్రేమ) అనే మధ్య తరగతి అమ్మాయిని రాకేష్ ప్రేమిస్తాడు. ఇది రాకేశ్ తండ్రి మహేంద్రకు నచ్చదు. దీంతో సురేఖను వేశ్యగా చిత్రీకరించి ఆమె మరణానికి కారణమవుతాడు. ఈ విషయం తెలిసిన రాకేశ్ తన తండ్రిని అసహ్యించుకుని వైరం పెంచుకుంటాడు. తల్లి శారద భర్త, కొడుకుల మధ్య నలిగిపోతూ ఉంటుంది. రాకేశ్‌కు తల్లి మాటంటే వేదవాక్కు. ఆమె తనయుడి ఆవేశాన్ని నియంత్రిస్తూ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. అటు రాజకీయాలు, ఇటు కుటుంబం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన మహేంద్ర బాలామణి(కృష్ణవేణి)ని హత్య చేస్తాడు. దాని నుంచి తప్పించుకునేందుకు రాకేశ్‌ను ఈ కేసు వాదించమని కోరతాడు. అందుకు రాకేశ్ అంగీకరించడు. మహేంద్ర తన తెలివి తేటలతో అతని తల్లిని పావుగా ఉపయోగించి పతి భిక్ష పెట్టమని రాకేశ్‌ను కోరమంటాడు. తల్లి మాట కాదనలేక రాకేశ్ కేసు ఒప్పుకొంటాడు. మరి ఈ కేసులో ఎవరు గెలిచారు?మహేంద్ర తప్పించుకున్నాడా? లేదా? అన్నది ‘ధర్మచక్రం’కథ.
* 1996లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
* 19 సెంటర్లలో 100రోజులు ఆడింది. ఈ సినిమాలోని రెండు పాటలను కెనడాలో చిత్రీకరించారు. ఆ దేశంలో చిత్రీకరణ జరుపుకొన్న తొలి తెలుగు సినిమాగా ‘ధర్మచక్రం’ రికార్డు సృష్టించింది.
* మొత్తం 62 రోజులపాటు చిత్రీకరణ జరగగా వెంకటేశ్ 52 రోజులు షూటింగ్లో పాల్గొన్నారు.
* ఎం.ఎం.శ్రీలేఖ అందించిన పాటలు ‘ధీర సమీరే..’, ‘చెప్పనా..చెప్పనా’, ‘ఆగదాయే రణం’ ‘సొగసు చూడు హాయి హాయిలే’ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
* ఉత్తమ నటుడిగా వెంకటేశ్ నంది అవార్డును అందుకున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి