Naarappa: చలాకీ చిన్నమ్మ.. బాగుందమ్మా! - venkatesh naarappa first single chalaaki chinnammi released
close
Published : 11/07/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Naarappa: చలాకీ చిన్నమ్మ.. బాగుందమ్మా!

హైదరాబాద్‌: వెంకటేశ్‌ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘చలాకీ చిన్నమ్మ’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. ఆదిత్య అయ్యంగార్‌, నూతన మోహన్‌ ఆలపించారు. అలరించేలా సాగే గీతాన్ని మీరూ వినండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని