Ravi Teja: రవితేజకు ఆ దర్శకుడు కథ వినిపించాడా? - venky kudumula narrate story to ravi teja
close
Published : 05/08/2021 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ravi Teja: రవితేజకు ఆ దర్శకుడు కథ వినిపించాడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సినిమాలతో జోరుమీదున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. మరోవైపు కొత్త కథలు వింటున్నారట. ఇటీవల ఓ యువ దర్శకుడి కూడా రవితేజకు కథ వినిపించారని టాలీవుడ్‌ టాక్‌. ఆ దర్శకుడు ఎవరో కాదు. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న వెంకీ కుడుముల ఇటీవల రవితేజను కలిసినట్లు సమాచారం. ఓ ఆసక్తికర స్క్రిప్ట్‌ను ఆయనకు వినిపించారట. రవితేజ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఓకే చెబుతారా? లేదా? అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఇప్పటికే వెంకీ కుడుములు మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌లతో చర్చలు జరిపినట్లు సమాచారం. వారికి చెప్పిన కథ కూడా ఇదేనా? లేక వేరేదా? తెలియాల్సి ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని