నా మొదటి పారితోషికం రూ.500: విద్యా బాలన్‌ - vidya balan reveals her first salary was rs 500 says she just had to pose beside a tree
close
Published : 17/06/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా మొదటి పారితోషికం రూ.500: విద్యా బాలన్‌

బీటౌన్‌ స్టార్‌ విద్యాబాలన్‌

ముంబయి: ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌ హీరోయిన్స్‌కు సైతం గట్టి పోటీనిచ్చి నటిగా బీటౌన్‌లో రాణిస్తున్నారు విద్యాబాలన్‌. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించి.. తన నటనతో అందర్నీ ఫిదా చేసిన విద్యాబాలన్‌.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘షేర్నీ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొన్నిరోజుల్లో ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన మొట్టమొదటి సంపాదన గురించి ఆమె మాట్లాడారు.

‘ఓ టూరిస్ట్‌ క్యాంపైన్‌ కోసం మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. నా సోదరి, మరో కజిన్‌ ఫ్రెండ్‌తో కలిసి టూరిస్ట్‌ క్యాంపైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. మేమంతా కలిసి ఓ చెట్టు పక్కన నిల్చుని.. చిరునవ్వులు చిందిస్తుండాలి. ఆ విధంగా ఫొటోకు పోజులిచ్చినందుకు మాకు తలో రూ.500 చెల్లించారు. అదే నా తొలి సంపాదన. ఓ ధారావాహికతో నేను మొదటిసారి నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇప్పటికీ ఆ రోజులు గుర్తున్నాయి. ధారావాహిక ఆడిషన్స్ కోసం మా అమ్మ, సోదరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లాను. రోజంతా అక్కడే వేచి చూశాను. సుమారు 150 మంది వరకూ ఆడిషన్స్‌కి వచ్చారు. నాకు అవకాశం రాకపోవచ్చు అనుకున్నాను. కానీ, అదృష్టం కొద్ది అందులో నటించే ఛాన్స్ నన్ను వరించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని