భయం వీడండి.. జాగ్రత్తగా ఉండండి  - vijay deverakonda talks about precautions to take if you have covid19
close
Published : 08/05/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయం వీడండి.. జాగ్రత్తగా ఉండండి 

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశతో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువులు సినీ ప్రముఖులు కొవిడ్‌ భాధితులకు తమ వంతు సాయం చేస్తున్నారు. మరికొంతమంది కరోనాపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెలుగు హీరో విజయ్‌ దేవరకొండ కొవిడ్‌ గురించి చెబుతూ..‘‘మీకు కొవిడ్ లక్షణాలు ఉంటే.. వెంటనే చికిత్స ప్రారంభించండి. పరీక్షలు చేయించుకుని ఫలితం వచ్చే దాకా ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స ప్రారంభించి  ప్రాణాలు కాపాడుకోమని’’ సూచించారు. ఆయన తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ట్వీటర్ వేదిక ద్వారా స్పందిస్తూ..‘‘కొవిడ్ రెండో దశ మనదేశం మొత్తాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది. 2020లోనే అందరం చాలా ఇబ్బంది పడ్డాం. దీన్ని నుంచి బయటపడ్డాం అనుకునే లోపు పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇప్పుడు లక్షలాది మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. మనకి కొవిడ్ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ఒంటినొప్పి లాంటివి ఉంటే.. అది కొవిడే అయింటుందని అనుకోండి. వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడటం మొదలెట్టండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో ఏరియా హాస్పిటల్స్‌లో, బస్తీ దవాఖానాలలో కొవిడ్ అవుట్ పేషెంట్ డాక్టర్లను పెట్టింది. మీరు వారితో మాట్లాడవచ్చు. కొవిడ్ టెస్ట్ చేయించుకుని, ఆ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూస్తూ.. సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు టైమ్ చాలా ముఖ్యం. నేను చెప్పిన ఎటువంటి లక్షణాలు మీకు అనిపించినా.. అది కొవిడ్‌ అనుకొని అందరికీ దూరంగా ఉంటూ మీరు చికిత్స ప్రారంభించండి. చికిత్స ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది. చికిత్స కూడా పెద్దగా ఏమీ ఉండదు. కొన్ని మందులు, ట్యాబ్‌లెట్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లినా, అవన్నీ ఒక కిట్ రూపంలో మీకు లభిస్తాయి. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి..’’ అంటూ డియర్‌ కామ్రేడ్ కోరారు.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని