Balakrishna: బాలకృష్ణ కోసం విజయ్‌ సేతుపతి? - vijay sethupathi as antagonist to balakrishna new movie
close
Published : 20/08/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Balakrishna: బాలకృష్ణ కోసం విజయ్‌ సేతుపతి?

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందనున్న ఆ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ‘అఖండ’లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్‌ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో పాల్గొంటారు బాలయ్య. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని