ఆకట్టుకుంటోన్న ‘చక్ర’ స్నీక్ పీక్
ఇంటర్నెట్ డెస్క్: విశాల్ కథానాయకుడుగా దర్శకుడు ఎం.ఎస్. ఆనందన్ తెరకెక్కించిన చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా, శ్రుతి నాయికలు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తుందీ సినిమాకు. ఈ నేపథ్యంలో స్నీక్ పీక్ పేరుతో సుమారు 3నిమిషాలున్న ఆసక్తికర సన్నివేశాన్ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నేరానికి పాల్పడే వ్యాపార సంస్థ సభ్యులకు, విశాల్ మధ్య సాగే సంభాషణలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారానికి గోప్యత లేదనే అంశంపై వాదన ప్రతివాదనలు ఆలోచింపజేస్తున్నాయి. ‘చట్టం అనేది పేదలకు, మిడిల్ క్లాస్ వాళ్లకే ఇలాంటి పదివేల కోట్లు కొట్టేసే వాళ్లకి కాదు’ అనే డైలాగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గతంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ ఇలాంటి నేపథ్యంలోనే వచ్చి విజయం అందుకుంది.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’