జనవరిలో ‘డిటెక్టెవ్‌-2’ చిత్రీకరణ! - vishal to resume thupparivaalan 2 from january 2022
close
Published : 18/06/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరిలో ‘డిటెక్టెవ్‌-2’ చిత్రీకరణ!

చెన్నై: ‘డిటెక్టెవ్‌’ చిత్రంతో తమిళ కథానాయకుడు విశాల్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందుకున్నాడు. తమిళంలో ‘తుప్పరివాలన్‌’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘డిటెక్టెవ్‌’గా విడుదలైంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని విశాల్‌ తలచారు. తొలిభాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు మిస్కిన్‌తోనే ‘తుప్పరివాలన్‌-2(డిటెక్టెవ్‌-2)’ తీయాలని పనులు మొదలుపెట్టారు. లండన్‌లో ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ చేశారు. అయితే తర్వాత ఈ చిత్రం ఆగిపోయింది. బడ్జెట్‌ విషయంలో మిస్కిన్‌కు, విశాల్‌కు విభేదాలు వచ్చాయని కోలీవుడ్‌ వర్గాలు చెప్పాయి. తాజాగా దీన్ని విశాలే తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 2022 జనవరి నుంచి కొత్త షెడ్యూల్‌కు విశాల్‌ సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని