ఒకటి కాబోతున్న విశాల్‌- జ్వాల - vishnu vishal and jwala wedding
close
Published : 13/04/2021 17:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకటి కాబోతున్న విశాల్‌- జ్వాల

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లికి ముహూర్తం కుదిరింది. ఏప్రిల్‌ 22న ఈ జంట ఒకటి కానుంది. సామాజిక మాధ్యమాల వేదికగా వివాహ ఆహ్వాన పత్రికని అభిమానులతో పంచుకున్నారు. ‘ఎప్పటిలానే మీ ప్రేమ, సహకారం కావాలి’ అని పేర్కొన్నారు విష్ణు.

కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. గుత్తా 2005లో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని