
ముంబయి: బాలీవుడ్లో వరుస బయోపిక్‌లు చేస్తూ దూసుకెళుతున్నారు బాలీవుడ్ భామలు కంగనారనౌత్, తాప్సీపన్ను. అయితే.. ఈ ఇద్దరి మధ్య నివురు గప్పిన నిప్పులా కయ్యం సాగుతోంది. సామాజిక మాధ్యమాల వేదిక తన భావాలను వ్యక్తపరిచే కంగన.. కొంతకాలంగా తాప్సీపై కామెంట్స్‌ను పెడుతోంది. దీనిపై తాప్సీ కూడా అదే స్థాయిలో స్పందించడంతో వివాదం బయటికి పొక్కింది. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ కనిపిస్తున్నారు. అసలేమైందంటే..
కొంతకాలం క్రితం తాప్సీ తన ఫొటోషూట్‌కు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అవి అచ్చం గతంలో కంగన పాల్గొన్న ఫొటోషూట్‌ను పోలి ఉన్నాయి. దీంతో కొంతమంది అభిమానులు ఈ ఇద్దరి ఫొటోలను పక్కపక్కనే ఉంచి.. ‘కంగన.. కంగన లైట్’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కంగన దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై స్పందించిన కంగన.. ‘ఆమె నాకు నిజమైన అభిమాని. నన్ను అధ్యయనం చేసి అనుకరించేందుకు ఎంతో విలువైన తన సమయాన్ని కేటాయిస్తోంది. నన్ను ప్రతిబింబించేలా ఉండేందుకు ప్రయత్నిస్తోంది’ అని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కంగన చేసిన వ్యాఖ్యలపై తాప్సీ స్పందించింది. ప్రముఖ అమెరికన్ రచయిత రాబర్ట్ హెయిన్లెయిన్ రచనను ‘థాట్ ఆఫ్ ది డే’ పేరుతో ఆమె పోస్టు చేసింది. ‘సమర్థులు, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఏ విషయంలోనూ అసూయపడరు. అసూయ అనేది అభద్రతాభావంలో ఉండే వాళ్ల లక్షణం’ అని ఆ రచన భావం. తాప్సీ పెట్టిన ఈ పోస్టుపై కంగన మళ్లీ స్పందించింది. ‘ఆమె అందం, ప్రతిభ చూసి నేను అసూయపడుతున్నాను’ అని మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇలా ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా కయ్యానికి దిగడం గమనార్హం. కాగా.. ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాప్సీ ‘రష్మీరాకెట్’ బయోపిక్‌లో నటిస్తుండగా.. ఇటీవల ‘తలైవి’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న కంగన ఇప్పుడు ‘తేజాస్’లో నటిస్తోంది.
ఇదీ చదవండి..
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి