జాన్‌ అబ్రహం అంత కాదు కానీ... - what shah rukh khan tweeted about rajkumar hirani and john abraham
close
Published : 26/06/2021 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాన్‌ అబ్రహం అంత కాదు కానీ...

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌. ఆయన తొలి చిత్రం ‘దివానా’. ఈ చిత్రం షారుఖ్‌కు తొలి అడుగులోనే మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా షారుఖ్‌ సరదాగా నెటిజన్లతో ముచ్చటిస్తూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానలిచ్చారు.

29 ఏళ్లలో మీకు నచ్చింది ఏంటి?

నా జీవితంలో విలువైన సంవత్సరాలివి. ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

ప్రస్తుతం ఏ దశలో ఉన్నానని అనుకుంటున్నారు?

నన్ను నేను కొత్తగా మలుచుకునే దశలో

ప్రేమలో విఫలం కావడాన్ని తట్టుకొని ఎలా ముందుకెళ్లాలి?

నువ్వు ఎప్పటికీ ఆ బాధని జయించలేవు. అదో జ్ఞాపకంగా మిగుల్చుకోవాలంతే. బాధ నుంచి మరింత బలంగా మారడం ఎలాగో నేర్చుకోవాలి.

ఖాళీ సమయాల్లో ఎలాంటి పుస్తకాలు చదవాలో సలహా ఇవ్వండి?

హ్యారీ పోర్టర్‌ సిరీస్‌ను చదవడం మళ్లీ మొదలుపెట్టు

2020 మీ జీవితాన్ని ఎలా మార్చింది?

తక్కువ పనిచేశాను... చాలా ఎక్కువ సమయం నా ప్రియమైన కుటుంబంతో గడిపాను.

మీ ఆరోగ్యం ఎలా ఉంది?

జాన్‌ అబ్రహం అంత అద్భుతంగా అయితే లేదు కానీ బాగానే ఉంది.

త్వరలో కొత్త ప్రకటనలు ఏమైనా చేయనున్నారా?

ప్రకటనలు చేసేది లౌడ్‌ స్పీకర్స్‌. నేను మీ మనసుల్లోకి సున్నితంగా వెళ్లిపోయే చిత్రాలను తీసుకొస్తా.

రాజ్‌కుమార్‌ హిరాణీతో సినిమా చేయనున్నారా?

ఇప్పుడే ఆయనికి ఫోన్‌ చేసి అడగాలి...ఎలాగూ ఆలస్యంగా నిద్రపోతారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని