ఆ ముగ్గురిలో విజయ్‌ సరసన నటించేదెవరు? - which of the three will play opposite vijay
close
Published : 07/02/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ముగ్గురిలో విజయ్‌ సరసన నటించేదెవరు?

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళ హీరో విజయ్‌ తాజాగా నటించిన చిత్రం ‘మాస్టర్‌’. ఈ సినిమాకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది.  ఈ నేపథ్యంలో మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు విజయ్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ విజయ్‌ 65వ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు.  సినిమా కోసం ముగ్గురు కథానాయికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో కియారా అడ్వాణి, రష్మిక మందన, పూజా హెగ్డే. అయితే ఈ ముగ్గురిలో విజయ్‌తో కలిసి ఎవరు ఆడిపాడనున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

చిత్రానికి కేజీఎఫ్‌ స్టంట్ మాస్టర్స్ అన్బు - అరివులు యాక్షన్ పార్ట్ ను కొరియాగ్రాఫ్‌ చేయనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్  పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి  అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీలో చిత్రం కనువిందు చేయనుంది.  దర్శకుడు నెల్సన్ తన తొలి  చిత్రంమైన కోలమావు కోకిలాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో నయనతార  ప్రధాన పాత్ర పోషించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని