Vishal: మరోసారి తీవ్రంగా గాయపడిన విశాల్‌ - while performing climax stunt sequence vishal back got injured severely
close
Published : 21/07/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishal: మరోసారి తీవ్రంగా గాయపడిన విశాల్‌

వైరల్‌గా మారిన వీడియో

చెన్నై: కోలీవుడ్‌ నటుడు విశాల్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తదుపరి సినిమా యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’. శరవణన్ దర్శకత్వంలో విశాల్‌ 31వ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈసినిమా షూట్‌ జరుగుతోంది. ఇందులో విశాల్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా సాగుతోన్న క్లైమాక్స్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్‌ వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు గతంలో ‘నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ షూట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఫైట్‌ సీక్వెన్స్‌ సమయంలో సమన్వయ లోపం ఏర్పడటంతో ఆయన తలకు, కంటికి స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. యువన్ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని