వుహాన్‌ మార్కెట్‌లో కరోనా మూలాల శోధన! - who teams visits wuhan food market in search of virus clues
close
Updated : 31/01/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వుహాన్‌ మార్కెట్‌లో కరోనా మూలాల శోధన!

వుహాన్‌: కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం.. తమ పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్​వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్‌లోని అతిపెద్ద మాంసాహార మార్కెట్‌ను ఆదివారం సందర్శించింది. ఈ మార్కెట్‌ కేంద్రంగానే లాక్‌డౌన్‌ సమయంలో చైనా ప్రభుత్వం వుహాన్‌లోని ప్రతి ఇంటికి ఆహారాన్ని చేరవేసింది. డబ్ల్యూహెచ్‌వో బృందంతో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు మార్కెట్‌ ప్రాంతానికి తరలివచ్చారు.

తొలిదశలో కరోనా కేసులు నమోదైన వుహాన్‌లోని జిన్‌యాన్‌టాన్‌​ఆసుపత్రిని, హుబెయ్ ప్రావిన్సులోని చైనీస్​, వెస్టర్న్ మెడిసిన్​ఆసుపత్రిని ఇప్పటికే ఈ బృందం సందర్శించింది. ఓ మ్యూజియంలోనూ శనివారం పర్యటించి వివరాలు సేకరించింది. ఇటీవలే 14 రోజుల క్వారంటైన్​పూర్తి చేసుకున్న ఈ బృందం.. క్షేత్రస్థాయి పరిశోధనను చేపట్టిన విషయం తెలిసిందే. సీఫుడ్​మార్కెట్​సహా, వుహాన్‌లోని ఇన్‌స్టిట్యూట్​ఆఫ్​వైరాలజీ ప్రయోగశాలను కూడా ఈ బృందం సందర్శించనుందని డబ్ల్యూహెచ్‌వో గత వారం ట్విట్టర్​వేదికగా తెలిపింది. వైరస్‌ వ్యాప్తికి చైనా నిర్లక్ష్యపూరిత వైఖరే కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. నిపుణుల బృందం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇవీ చదవండి...

త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది

కరోనా టీకా విషయంలో భారత్‌ రికార్డులు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని