అందుకే ‘అతడు’కి సంగీతం ఇవ్వలేదు! - why dsp rejected atadu movie here is the reason
close
Updated : 14/03/2021 21:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ‘అతడు’కి సంగీతం ఇవ్వలేదు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన చిత్రం ‘అతడు’. కథ, కథనమే కాదు ఈ సినిమాలోని సంగీతం విశేషంగా అలరించింది సినీ ప్రియుల్ని. అంతగా మణిశర్మ తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. నేపథ్య సంగీతం మరో స్థాయిలో నిలుస్తుంది. మరి మణిశర్మ స్థానంలో దేవీశ్రీ ప్రసాద్‌ ఉండుంటే? ఎందుకంటారా... ముందుగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మనే ఎంపిక చేసింది చిత్రబృందం. అనివార్య కారణాల వల్ల సినిమా ప్రారంభమయ్యాక మణిశర్మకి ఈ సినిమా చేయడం కుదరలేదు. దాంతో డీఎస్పీని సంప్రదించగా ‘ఆ సంగీత దర్శకుడు నాకు బాగా క్లోజ్‌. ఆయనే కాదు వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రారంభించిన చిత్రం వాళ్ల అనుమతి లేకుండా చేయలేను. నేను  విలువల్ని పాటిస్తాను’ అంటూ తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నారు దేవీ. ఈ మాట విన్న దర్శక-నిర్మాతలు దేవీని కొనియాడి మళ్లీ మణిశర్మనే తీసుకున్నారు. అలా మిస్‌ అయిన డీఎస్పీ-మహేశ్‌ కాంబినేషన్‌ ‘1 నేనొక్కడినే’తో మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ‘శ్రీమంతుడు’,‘భరత్‌ అనే నేను’ ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ అన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని