విల్‌స్మిత్‌ కామెడీ షో - will smith to host comedy variety special at netflix
close
Published : 18/06/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విల్‌స్మిత్‌ కామెడీ షో

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ కథానాయకులు... అప్పుడప్పుడూ బుల్లితెర మీద సందడి చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కార్యక్రమ నిర్వాహకులుగా, యాంకర్‌గా ప్రతిభను చాటుకుంటుంటారు. ఇప్పుడు హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ విల్‌స్మిత్‌ ఇదే బాట పట్టారు. ఇప్పటికే అతను నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ ప్రసారం చేసే ఓ డాక్యుమెంటరీకి వ్యాఖ్యాతగా చేశాడు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌కు విల్‌స్మిత్‌ ఓ కామెడీ టాక్‌షో నిర్వహించనున్నారు. ఇది ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానుంది. ‘‘విల్‌స్మిత్‌ షో త్వరలోనే మీ ముందుకు రానుంది. తారలతో కబుర్లు, కామెడీ స్కిట్లు, సంగీతం ఉంటాయి’’ అని నెట్‌ఫ్లిక్స్‌ బృందం సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని