Karnataka: మా ఊరికి రోడ్డు వేసేవరకు పెళ్లే చేసుకోను.. సీఎం కార్యాలయానికి యువతి లేఖ - wont marry till village has proper roads karnataka womans letter spurs cmo to action
close
Published : 18/09/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karnataka: మా ఊరికి రోడ్డు వేసేవరకు పెళ్లే చేసుకోను.. సీఎం కార్యాలయానికి యువతి లేఖ

బెంగళూరు: దేశంలోని అనేక చోట్ల రోడ్లు దయనీయంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్ల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. తమ సమస్య తీర్చాలని అధికారులు, నేతల చుట్టూ తిరిగినా ఆ గ్రామస్థులకు మొండిచేయే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయిని వినూత్న రీతిలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. తమ గ్రామానికి సరైన రోడ్లు వేసేవరకూ తాను పెళ్లే చేసుకోనని సీఎంఓ కార్యాలయానికి లేఖ రాసింది.

దేవంగరా జిల్లా హెచ్‌ రామ్‌పురా ప్రాంతానికి చెందిన బిందు(26) ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తమ గ్రామంలో దయనీయ పరిస్థితిలో ఉన్న రోడ్లు, వాటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కార్యాలయానికి ఓ లేఖ రాసింది. వెంటనే రోడ్లను బాగుచేయాలని కోరింది. ‘మా గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఇంకా వెనుకబడే ఉంది. రోడ్లు సరిగా లేక మా గ్రామస్థులు చదువుకోవడం లేదు. అందుకే పెళ్లి సంబంధాలు కూడా రావడంలేదు’ అని బిందు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఉపాధ్యాయురాలు రాసిన లేఖకు సీఎంఓ కార్యాలయం స్పందించింది. మీ గ్రామ సమస్యను త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చింది. అక్కడ తక్షణమే పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖను సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని