Xiaomi Smart Glasses: షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌.. స్క్రీన్ కాదు మరో స్మార్ట్‌ఫోన్‌ - xiaomi launches its first smart glasses price not yet announced
close
Updated : 16/09/2021 17:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Xiaomi Smart Glasses: షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌.. స్క్రీన్ కాదు మరో స్మార్ట్‌ఫోన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి కంపెనీ స్మార్ట్‌ వేరబుల్స్‌ శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు గృహోపకరణాలను విడుదల చేసిన షావోమి.. తాజాగా స్మార్ట్‌ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌గ్లాసెస్‌ మోడల్స్‌కి భిన్నంగా సరికొత్త ఫీచర్స్‌ని ఇందులో పరిచయం చేసినట్లు తెలిపింది. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌లో మైక్రో ఎల్‌ఈడీ ఆప్టికల్ వేవ్‌గైడ్ సాంకేతికతను ఉపయోగించారు. దీంతో స్మార్ట్‌గ్లాసెస్‌ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, నేవిగేషన్, కాలింగ్, ఫొటో, ట్రాన్స్‌లేషన్ వంటి సర్వీసులను యూజర్‌కి అందిస్తుంది. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌లో క్వాడ్‌కోర్ ఏఆర్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌ సాయంతో ఈ స్మార్ట్‌గ్లాసెస్ పనిచేస్తాయి.

ఈ గ్లాసెస్‌కి ఎడమవైపు ఫ్రేమ్‌లో 5 ఎంపీ కెమెరా అమర్చారు. దీని సాయంతో యూజర్‌ ఫొటోలు తీయడంతోపాటు, ఫొటోలోని టెక్ట్స్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అలానే కుడివైపు గ్లాస్‌లో 0.13 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది ఫోన్‌ కాల్స్‌, నావిగేషన్‌, నోటిఫికేషన్స్‌, ఫొటో వంటి వాటిని స్క్రీన్‌పై చూపిస్తుంది. షావోమి ఏఐ అసిస్టెంట్ సాయంతో యూజర్‌ ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను ఉపయోగించవచ్చు. ఫోన్‌కాల్, నోటిఫికేషన్, ఫొటో ట్రాన్స్‌లేషన్‌ వంటి కమాండ్స్‌తో స్మార్ట్‌గ్లాసెస్‌ సేవలను యూజర్ పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌ని గ్లాసెస్‌కి అనుసంధానించుకుంటే ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్స్‌ స్మార్ట్‌గ్లాసెస్‌లో చూడొచ్చు. కాల్స్‌ మాట్లాడుకునేందుకు ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ ఇస్తున్నారు. ఇందులో మొత్తం 497 కాంపోనెంట్స్ ఉపయోగించారు.

ఇది కేవలం స్మార్ట్‌ఫోన్‌కి రెండో స్క్రీన్‌లా మాత్రమే కాకుండా మరో స్మార్ట్‌ఫోన్‌లా పనిచేస్తుందని షావోమి తెలిపింది. ఇవి కేవలం 51 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్-రేబాన్ సంయుక్తంగా స్మార్ట్‌గ్లాసెస్‌ను ఆవిష్కరించాయి. అంతకుముందే గూగుల్, స్నాప్‌ఛాట్, లెనోవా, ఫౌనా కంపెనీలు కూడా స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా ఈ జాబితాలో షావోమి స్మార్ట్‌గ్లాసెస్ చేరాయి. అయితే వీటిని మార్కెట్లోకి ఎప్పుడూ విడుదల చేస్తారు.. ధరెంత వంటి విషయాలపై షావోమి ప్రకటన  చేయాల్సివుంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని