యోగా నేపాల్‌లో పుట్టిందన్న కేపీ శర్మ ఓలి - yoga originated in nepal not in india claims pm kp sharma oli
close
Published : 22/06/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యోగా నేపాల్‌లో పుట్టిందన్న కేపీ శర్మ ఓలి

కాఠ్‌మాండూ: యోగా నేపాల్‌లోనే పుట్టిందంటూ మరో కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి. యోగా ప్రపంచానికి పరిచయమైనప్పుడు అసలు భారత్‌ అనే దేశమే లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం తన అధికారిక నివాసం బలువతార్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఓలి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. యోగాను కనుగొన్న తమ ఋషుల గొప్పతన్నాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయంలో సఫలమయ్యారని తెలిపారు. జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మోదీ ప్రతిపాదించడంతో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కేపీ శర్మ ఓలి గతంలోనూ రాముడి జన్మస్థానమైన అయోధ్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని