NTR: అభిమానితో వీడియోకాల్‌ మాట్లాడిన ఎన్టీఆర్‌! - young tiger ntr made video call and talk with his fan
close
Updated : 26/10/2021 09:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NTR: అభిమానితో వీడియోకాల్‌ మాట్లాడిన ఎన్టీఆర్‌!

హైదరాబాద్‌: సినీతారలను ప్రాణంతో సమానంగా అభిమానించే వారు ఎందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి అభిమానులు లక్షల్లో ఉంటారు. తమ కథానాయకుడిని ఒక్కసారైనా కలవాలని, మాట్లాడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక అభిమానులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సినీ తారలు సైతం వాళ్లను కలిసి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. కరోనాకు ముందు నేరుగా కలిసిన సందర్భాలు అనేకం. ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు యువ కథానాయకుడు ఎన్టీఆర్‌.  తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన అభిమానితో వీడియో కాల్‌ మాట్లాడి ధైర్యం నింపారు.

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళి.. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఇటీవల మురళి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎన్టీఆర్‌ అభిమాన సంఘం కలిసింది. తారక్‌కు ఫోన్‌ చేసి మురళితో మాట్లాడించింది. ఈ సందర్భంగా మురళికి ఎన్టీఆర్‌ ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న అభిమానులకు తనవంతు సాయం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక మురళీ ఆరోగ్య ఖర్చులకు గానూ ఎన్టీఆర్‌ అభిమానులు ఆయనకు రూ.2.5లక్షలు అందించారు. తనతో వీడియో కాల్‌లో మాట్లాడినందుకు ఎన్టీఆర్‌కు, సాయం చేసినందుకు ఆయన అభిమానులకు మురళి కృతజ్ఞతలు తెలిపారు.


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని