ఆహాలో ‘జాంబీరెడ్డి’.. ట్రైలర్‌ చూశారా? - zombie reddy trailer premieres march 26 aha
close
Published : 19/03/2021 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహాలో ‘జాంబీరెడ్డి’.. ట్రైలర్‌ చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్: ‘అ’ సినిమాతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో జాంబీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘జాంబీరెడ్డి’. తేజ సజ్జా కథానాయకుడు. యాపిల్ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సరికొత్త ట్రైలర్‌ను ఆహా అభిమానులతో పంచుకుంది. ఆనంది, ద‌క్ష నగర్కర్‌‌, హర్షవర్థన్‌‌, ర‌ఘుబాబు, హ‌రితేజ‌, పృథ్వీరాజ్‌, కారుమంచి రఘు తదితరులు నటించిన ఈ సినిమా మార్చి 26న ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని