close

తాజావార్తలు

థియేటర్లలో సంక్రాంతి సందడి 

రజనీ, అజిత్‌ అభిమానుల జోరు 
కటౌట్లకు పాలాభిషేకాలు 
అభిమానులతో ‘పేట’ను వీక్షించిన ధనుష్‌ 

థియేటర్లలో సంక్రాంతి సందడి 

వెండితెర వాకిట అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. గురువారం రెండు పెద్ద చిత్రాలు విడుదలవడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అందులోనూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అజిత్‌ల చిత్రాలు కావడంతో పోటీపడి మరీ బ్యానర్లు, కటౌట్లు కట్టారు. కటౌట్లకు పాలాభిషేకాలు, కొబ్బరి, గుమ్మడికాయలతో దిష్టి తీయడం, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం కనిపించింది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లు రంగులమయంగా మారాయి. రజనీకాంత్‌ అభిమానులకు పోటీగా అజిత్‌ అభిమానులు పలుచోట్ల బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడం విశేషం.

పెరిగిన అభిమానం 
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలోని ‘పేట’, శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ‘విశ్వాసం’ చిత్రాలు గురువారం విడుదలయ్యాయి. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచే ఇరువురి అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. సామాజిక మాధ్యమాలు కేంద్రంగా ఇద్దరూ వాగ్యుద్దానికి దిగారు. తమదైన మీమ్స్‌తో అభిమానులు సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో గురువారం సినిమా విడుదల సందర్భంగా అభిమానులు బుధవారం రాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాచారు. చెన్నైలోని అల్బర్ట్‌, కాశి థియేటర్లలో రజనీకాంత్‌ అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.

 

థియేటర్‌లో ధనుష్‌, కుటుంబీకులు 
రజనీకాంత్‌ సినిమా విడుదలవుతోందంటే.. అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ సతీమణి లత, ధనుష్‌, త్రిషలు రోహిణి థియేటర్‌లో తొలి షో చూశారు. అభిమానులతో కలసి ధనుష్‌ చిందులేసి మరీ చిత్రాన్ని వీక్షిస్తూ అభిమానులు మరింత జోష్‌ పెంచారు.

 

అభిమానులకు గాయాలు 
విల్లుపురం జిల్లా తిరుకోవిలయూర్‌లోని ఓ థియేటర్‌లో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ విడుదలైంది. అభిమానులు 15 అడుగుల ఎత్తున్న కటౌట్‌ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు ఆ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా అది కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. రజనీకాంత్‌ అభిమానులు, అజిత్‌ అభిమానుల మధ్య రోహిణి థియేటర్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ‘పేట’ పోస్టర్‌ను అజిత్‌ అభిమానులు చింపివేయడమే ఘర్షణకు కారణం.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

థియేటర్లలో సంక్రాంతి సందడి 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.