close

తాజావార్తలు


‘షాకయ్యా..ఎంతో బాధపడ్డా’

నా ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు: అమోల్‌ పాలేకర్‌

ముంబయి: కార్యక్రమంలో తనను మాట్లాడనివ్వనందుకు ఎంతో బాధపడ్డానని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమోల్‌ పాలేకర్‌. ఇటీవల ముంబయిలోని ఎన్‌జీఎంఏ (నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌) పేరిట ఓ ప్రదర్శనను నిర్వహించారు. ప్రముఖ కళాకారుడు ప్రభాకర్‌ బార్వేను స్మరించుకుంటూ ఈ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. ఈ వేడుకకు అమోల్‌ కూడా వెళ్లారు. అయితే ఆయన ప్రభాకర్‌ గురించి ప్రసంగిస్తూ ఇతర ప్రదేశాల్లో ఆర్ట్‌ గ్యాలరీకి సంబంధించిన అడ్వైజరీ కమిటీలను తొలగించినందుకు సంస్కృతిక శాఖపై విమర్శలు చేశారు.  

దాంతో అదే కార్యక్రమంలో ఉన్న ఇతర వ్యక్తులు ‘మీరు ప్రభాకర్‌ గురించి మాట్లాడండి. మిగతా విషయాలు అనవసరం’ అంటూ పలుమార్లు ఆయన ప్రసంగాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో అమోల్‌ బాధపడ్డారు. దీనిపై ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి తనకు అవమానం జరిగిందంటూ తెలిపారు. ‘నా ప్రసంగాన్ని వారు ఆపుతున్నప్పుడు అక్కడున్న ప్రేక్షకుల్లో ఏ ఒక్కరూ లేచి నాకు మద్దతు తెలపలేదు. ఈ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. చాలా బాధపడ్డాను. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ప్రభాకర్‌ బార్వేలాంటి గొప్ప కళాకారుడిని గుర్తుచేసుకోవడానికి ఎన్‌జీఎంఏకు 24 ఏళ్లు పట్టింది. ఈ అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆపేశారు. పైగా ఈ విషయం గురించి ముందు తమకు ఎందుకు చెప్పలేదని కార్యక్రమంలో ఉన్న కొందరు సభ్యులు నన్ను ప్రశ్నించారు’ అని చెప్పుకొచ్చారు అమోల్‌.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.