close

తాజావార్తలు


నీ స్వరం స్వర్గంలోని ఎన్టీఆర్‌కు వినిపిస్తుంది: వర్మ

హైదరాబాద్‌: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లోని ఓ పాటను బొమ్మాలి రవిశంకర్‌ ఆలపించారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు రికార్డింగ్‌ రూమ్‌లో తీసిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. రవి శంకర్‌ గాత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ‘‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లోని ఓ ఉరుములాంటి పాటను బొమ్మాలి రవిశంకర్ ‌జూబ్లీ 10 స్టూడియోలో పాడారు. సిరశ్రీ ఈ పాటకు సాహిత్యం అందించారు. కల్యాణి మాలిక్‌ సంగీతం అందించారు. హే రవిశంకర్..‌ నీ స్వరంలోని పవర్‌ స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా వినపడేలా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ‘గర్జన.. సింహ గర్జన..’ అని సాగే ఈ పాటను ఎంతో ప్రభావవంతంగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా వర్మ ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు పోషిస్తున్నారు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు. కీరవాణి సోదరుడు కల్యాణి‌ మాలిక్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు వర్మ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఫిబ్రవరి 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని గతంలో ఆయన అన్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.