close

తాజావార్తలు

‘నా కూతురికి ఆ పేరే పెడతా’

ఆలియా భట్

ముంబయి: బాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయికల్లో ఆలియా భట్‌ ఒకరు. ఇప్పుడు అందరి కళ్లు ఆమె పెళ్లిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఆలియా.. బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు ఆమె తండ్రి మహేశ్‌ భట్‌ ఓ సందర్భంలో వెల్లడించారు. దాంతో ఆలియా, రణ్‌బీర్‌లు ఈ ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియా తనకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

భవిష్యత్తులో తనకు కూతురు పుడితే ఏ పేరు పెట్టాలో కూడా నిర్ణయించేసుకున్నారట. పాపకు అల్మా అని పేరుపెడతానని అంటున్నారు. ఆలియా కథానాయికగా నటించిన ‘గల్లీ బాయ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ అభిమాని ఆలియా పేరు మర్చిపోయి ఆమెను ‘అల్మా’ అని సంబోధించారు. దాంతో తనకు ఈ పేరు ఎంతో నచ్చిందని, తన కూతురికి ఇదే పేరు పెట్టాలనుకుంటున్నాని ఆలియా తెలిపారు. రణ్‌వీర్, ఆలియా జంటగా నటించిన ‘గల్లీ బాయ్‌’ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.