close

తాజావార్తలు


హీరో విజయ్‌కు వింత అనుభవం

పడబోతున్న కంచెను అడ్డుకుని..

చెన్నై: తమిళ స్టార్‌ విజయ్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ను చూడటం కోసం, కలిసి సెల్ఫీ దిగడం కోసం అభిమానులు బారులు తీరుతుంటారు. తాజాగా ఆయనకు వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం విజయ్‌ తన 63వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చెన్నై శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఆయన్ను చూడటానికి అభిమానులు సెట్‌ దగ్గర ఉన్న కంచె (ఇనుప కడ్డీలతో నిర్మించింది) వద్ద గుమిగూడారు. బృందంతో కలిసి అటుగా వెళ్లిన విజయ్‌.. ఫ్యాన్స్‌ను పలకరిస్తూ నడుస్తున్నారు. ఈ క్రమంలో చిన్నపాటి తొక్కిసలాంటి ఘటన జరిగి కంచె ముందుకు పడబోయింది. దీంతో విజయ్‌ వెంటనే కంచె పడకుండా పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయనతోపాటు బాడీగార్డులు, మిగిలిన వారంతా కంచె కింద పడకుండా ఆపారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంచె కిందపడి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని, విజయ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించారని అభిమానుల్ని కాపాడారని నెటిజన్లు మెచ్చుకున్నారు. విజయ్‌ నిజమైన హీరో అని మరికొందరు అన్నారు.

విజయ్‌ ఇటీవల ‘సర్కార్‌’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది. ఇందులో కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ 63వ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.