close

తాజావార్తలు

నేను లేనిదే సినిమా చేయలేమన్నారు: రాధిక

చెన్నై: మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌తో కలిసి వెండితెరను పంచుకోబోతుండటం చాలా సంతోషంగా ఉందని సీనియర్‌ నటి రాధిక అన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఇత్యమాణి: మేడ్‌ ఇన్‌ చైనా’. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. హనీ రోజ్‌ ఇందులో మోహన్‌లాల్‌ సరసన నటిస్తున్నారు. రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని  బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోను రాధిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. మోహన్‌లాల్‌ లాంటి నటుడితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాట్లు తెలిపారు. ‘ఈ సినిమా కోసం మోహన్‌లాల్‌తో కలిసి వెండితెరను పంచుకోవడం గౌరవంగా, గర్వంగా ఉంది. ‘సినిమాకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, మీరు లేకపోతే ఈ స్క్రిప్టును సినిమాగా తీయలేం’ అని ఆయన చెప్పడం ఇంకా గర్వంగా ఉంది. ధన్యవాదాలు సర్‌’ అని రాధిక ట్వీట్‌ చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.