close

తాజావార్తలు

ఈ లోకానికి మరో ఐరన్‌ మ్యాన్‌ కావాలి

‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ తెలుగు ట్రైలర్‌

లాస్‌ఏంజెల్స్‌: మార్వెల్‌ సంస్థ ‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ఎండ్‌గేమ్’ సినిమా ముగిసిన దగ్గర్నుంచి ‘స్పైడర్‌మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ సినిమా కథ మొదలవుతుందట. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లో జరిగిన సంఘటనల అనంతరం పీటర్‌ పార్కర్‌ అలియాస్‌ స్పైడర్‌మ్యాన్‌ తన స్నేహితులతో కలిసి విహారయాత్ర నిమిత్తం యూరప్‌ వెళ్లాలనుకుంటాడు. ఇంతలో నిక్‌ ఫ్యూరీ (శామ్యుల్‌ జాక్సన్‌) బృందం ఓ ముఖ్యమైన పని నిమిత్తం స్పైడర్‌మ్యాన్‌ను టార్గెట్‌ చేసి శత్రువైన క్వెంటిన్‌ బెక్‌తో చేతులు కలపాలని డిమాండ్‌ చేస్తాడు. ‘ఈ లోకానికి మరో ఐరన్‌మ్యాన్‌ కావాలి’ అని స్పైడర్‌మ్యాన్‌ చెబుతున్న డైలాగ్‌లతో ఆసక్తికరమైన సంభాషణలతో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. జాన్‌ వాట్స్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జులై 2న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.