
తాజావార్తలు
ముంబయి: బాలీవుడ్ పవర్‌కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటగా మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రస్తుతం సైఫ్ ‘జవానీ జానేమన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కరీనా.. సైఫ్‌కు మాజీ ప్రేయసి పాత్రలో నటించనున్నారట. అయితే ఆమె పాత్ర మాజీ ప్రేయసా? లేక మాజీ భార్యా? అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉందని మీడియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లండన్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
పూజా బేడీ కుమార్తె అలైయా ఈ సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఇందులో అలైయా సైఫ్ కుమార్తె పాత్రను పోషిస్తున్నారు. 40 ఏళ్ల తండ్రికి, 20 ఏళ్ల కుమార్తెకి మధ్య ఉన్న అనుబంధం గురించి సినిమాలో చూపించబోతున్నారు. సైఫ్, కరీనా జంటగా ‘ఎల్వోసీ కార్గిల్’, ‘ఓంకారా’, ‘టషన్’, ‘కుర్బాన్’, ‘ఏజెంట్ వినోద్’ సినిమాల్లో నటించారు.