
తాజావార్తలు
హైదరాబాద్: సినీ కెరీర్ ప్రారంభించకముందు కొన్నాళ్లు లాయర్‌గా పనిచేశానని మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టి తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘మామంగం’. పద్మకుమార్ దర్శకుడు. ఇందులో మమ్ముటి విప్లవ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. పీరియడ్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ముమ్ముట్టి మీడియాతో మాట్లాడారు. తను ఓ ‘యాక్సిడెంటల్ లాయర్’ అని చెప్పారు.
‘నేను నటుడ్ని కావాలని కలలు కన్నా. కానీ అనుకోకుండా కొన్నాళ్లు లాయర్‌గా పనిచేశా. తొలి అవకాశం కోసం ఎంతో కష్టపడ్డా. తర్వాత అవకాశాలు నా వద్దకే వచ్చాయి. ‘మామంగం’ సినిమాలో నా పాత్ర, ఈ కథకు చరిత్రలో ఉన్న ప్రాముఖ్యం విషయాల్లో నేను చాలా ఉత్సుకతగా ఉన్నా. ఉత్తర కేరళలో 15, 16వ శతాబ్ద కాలంలో జరిగిన కథ ఇది. అప్పట్లో ఎందరో ధీరులు ఉండేవారు. వారి త్యాగాల్ని నేటి తరం తెలుసుకోవాలి. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’ అని ముమ్ముట్టి అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి