close

తాజావార్తలు

‘సైరా’ సెట్‌లో అనుష్కకు గాయం?

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్‌లో గాయపడ్డారట. ఇటీవల సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్వీటీ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోమని అనుష్కకు సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మీడియాకు చెప్పడానికి అనుష్క ఒప్పుకోలేదట. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించి అనుష్క గానీ, చిత్రబృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోపక్క అనుష్క ‘సైలెన్స్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులోని ఓ కీలక పాత్రలో అనుష్క నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అమిత్‌ త్రివేదీ బాణీలు అందిస్తున్నారు. విజయ్‌సేతుపతి, నయనతార, సుదీప్‌, అమితాబ్‌ బచ్చన్‌, తమన్నా, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.