close

తాజావార్తలు

వరల్డ్‌ కప్‌ అయ్యాక ‘వరల్డ్‌ కప్‌’ షూటింగ్‌!

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్‌ ప్రస్తుతం ‘83’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. లెజండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983లో టీమిండియా ప్రపంచకప్‌ ఎలా సాధించింది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను కబీర్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను లార్డ్స్‌ మైదానంలో తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక చిత్రబృందం ఇంగ్లాండ్‌కు బయలుదేరుతుంది. జులైలో కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది.

ఈ చిత్రంలో కపిల్‌ భార్య రోమీ దేవ్‌ పాత్రలో.. రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె నటిస్తున్నారు. 1983లో ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు టీమిండియా గెలవదేమోనన్న భయంతో కపిల్‌ భార్య లార్డ్స్‌ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత టీమిండియా మంచి ఆటతీరు కనబరుస్తోందని తెలిసి స్టేడియంలోకి వచ్చారు. ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా తెరకెక్కించబోతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.