close

తాజావార్తలు

ఈ ఒక్క పోస్ట్‌తో మళ్లీ టాప్‌ లిస్ట్‌లోకి ప్రియాంక

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న ‘గ్లోబల్‌స్టార్‌’ ప్రియాంక.. సోషల్‌మీడియా వేదికగానూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ విడుదల చేసే ‘గ్లోబల్‌ మీడియా క్లైంబర్స్‌ చార్ట్‌’లో మళ్లీ ప్రియాంక అగ్రస్థానానికి వచ్చేసింది. ఇదిగో ఈ ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో వరుసగా గత నాలుగు వారాల్లో మూడుసార్లు టాప్‌ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ మొత్తం 12 సార్లు ఈ జాబితాలో ప్రియాంక అగ్రస్థానంలో ఉండటం విశేషం.

గతవారం ఆరోస్థానంలో ఉన్న ప్రియాంక.. ‘ది రాక్‌’ డ్వేన్‌ జాన్సన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో ఆ వారం అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీలతో హాలీవుడ్‌ రిపోర్టర్‌ జాబితా తయారు చేసి విడుదల చేస్తుంది. కాగా, ప్రియాంక స్విమ్‌ సూట్‌లో ఉన్న ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ప్రియంక భర్త, గాయకుడు నిక్‌ జోన్స్‌ ఈ ఫొటోలను తీయగా, దాదాపు 30లక్షలమంది ఈ ఫొటోను లైక్‌ చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.