close

తాజావార్తలు

దేశముదురు.. పోకిరి.. ఇప్పుడు ఇస్మార్ట్‌ శంకర్‌!

హైదరాబాద్‌: నటి, నిర్మాత ఛార్మి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’పై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఆమె భావిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ఇది. రామ్‌ కథానాయకుడు. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ కథానాయికలు. మణిశర్మ బాణీలు అందించారు. ఈనెల 18న చిత్రం విడుదల కాబోతోంది. కాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుందని ఛార్మి వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ లభించినట్లు తెలిపారు. ‘‘దేశముదురు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’.. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ నాలుగు సినిమాలకూ సెన్సార్‌ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్‌ లభించింది’ అని నవ్వుతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.