close

తాజావార్తలు

అనుష్క ‘నిశ్శబ్ధం’.. పోస్టర్‌ చూశారా?

హైదరాబాద్‌: ‘భాగమతి’ హిట్‌ తర్వాత అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్ధం’. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. స్వీటీ చిత్ర పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆమెకు యూనిట్‌ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో అనుష్క చేతులు మాత్రమే చూపించారు. ఇందులో ఆమె దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.

ఈ చిత్రానికి మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ కూడా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో తన లుక్‌ను తెలుపుతూ అనుష్క ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.