close

తాజావార్తలు

‘మహాసముద్రం’లో రవితేజకు జోడీగా రాశీఖన్నా?

హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘మహా సముద్రం’. ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అదితిరావు హైదరీని ఎంచుకున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపించాయి. తాజాగా రవితేజకు జోడీగా రాశీఖన్నా నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల టాక్‌. అదితికి వేరే ప్రాజెక్టులు ఉండటంతో డేట్స్‌ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాశీ గతంలో రవితేజ సరసన బెంగాల్‌ టైగర్, టచ్‌ చేసి చూడు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రవితేజ.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.