Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143001
            [news_title_telugu_html] => 

హీరో అవ్వాలని అనుకోలేదు: రజనీ

[news_title_telugu] => హీరో అవ్వాలని అనుకోలేదు: రజనీ [news_title_english] => [news_short_description] => తాను హీరో కావాలనే ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి రాలేదని, విలన్‌గా నటించాలన్నదే అప్పటి లక్ష్యమని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 07:44:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హీరో అవ్వాలని అనుకోలేదు: రజనీ - EENADU
close

తాజావార్తలు

హీరో అవ్వాలని అనుకోలేదు: రజనీ

చెన్నై: తాను హీరో కావాలనే ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి రాలేదని, విలన్‌గా నటించాలన్నదే అప్పటి లక్ష్యమని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేర్కొన్నారు. ప్రముఖ సినీ కథా రచయిత, నిర్మాత కలైజ్ఞానానికి సన్మాన సభ ఇటీవల జరిగింది. ఇందులో రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలైజ్ఞానానికి ఇలాంటి అభినందన సభను దర్శకుడు భారతిరాజా నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. భారతిరాజా నన్నెప్పుడూ ‘తలైవరే’ అనే పిలుస్తారు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచే స్నేహ బంధం దృఢమైంది అన్నారు. డబ్బు, పేరు ప్రఖ్యాతలను ఎప్పుడైనా సంపాదించుకోవచ్ఛు కానీ పాత స్నేహితులను సంపాదించుకోవడం చాలా కష్టం.

నాకు హీరోగా నటించాలనే ఆలోచనే లేదు. ఆరంభంలో విలన్‌గానే నటించా. అయితే నన్ను హీరోగా చేసిన ప్రత్యేకత కలైజ్ఞానంది. ‘భైరవి’ చిత్రంలో హీరోగా నటించా. ప్రేక్షకులు నన్ను హీరోగా అంగీకరించారు. అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా విజయం సాధించింది. సినిమా కథా రచయితలకు తగిన గౌరవ మర్యాదలు కల్పించాలి. నేను నటించిన చంద్రలేఖ, బాషా, మలైకల్లన్‌ వంటి పెద్ద హిట్‌ చిత్రాలకు కథా రచయిత ఎవరని కూడా ప్రేక్షకులకు తెలియదు. ఈ పరిస్థితి మారాలి. కలైజ్ఞానం అద్దె ఇంట్లో ఉన్నట్లు విన్నా. ఆయనకు ప్రభుత్వం తరఫున ఇల్లు ఇవ్వనున్నట్లు మంత్రి కడంబూర్‌ రాజు చెప్పారు. కానీ నేను ప్రభుత్వానికి ఆ అవకాశాన్ని ఇవ్వదలచుకోలేదు. ఆయన నివసించేందుకు నేనే మంచి ఇంటిని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కడంబూరు రాజు, భారతిరాజా, ఎస్‌ఏ చంద్రశేఖర్‌, భాగ్యరాజ్‌, అమీర్‌, ఆర్‌వీ ఉదయకుమార్‌, ఆర్‌కే సెల్వమణి, పాటల రచయిత వైరముత్తు, నటుడు శివకుమార్‌, నటి కేఆర్‌ విజయ, లతా రజనీకాంత్‌, నిర్మాత థాను తదితరులు పాల్గొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.