Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143007
            [news_title_telugu_html] => గూగుల్‌ ప్లేస్టోర్‌లో‘సాహో ది గేమ్‌’
            [news_title_telugu] => గూగుల్‌ ప్లేస్టోర్‌లో‘సాహో ది గేమ్‌’
            [news_title_english] => Saaho The Game is now available on Google Play Store too
            [news_short_description] => ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు....

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => |1162294032535445504||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-17 00:28:31
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
గూగుల్‌ ప్లేస్టోర్‌లో‘సాహో ది గేమ్‌’ - Saaho The Game is now available on Google Play Store too - EENADU
close

తాజావార్తలు

గూగుల్‌ ప్లేస్టోర్‌లో‘సాహో ది గేమ్‌’

హైదరాబాద్‌: ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆండ్రాయిడ్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి వారికి శుభవార్త. ‘సాహో ది గేమ్‌’ను గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. గేమ్‌ ఆడాలనుకునే వారు గూగుల్‌ ప్లేలోకి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ లింక్‌ను కూడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ గేమ్‌ యాప్‌ను పిక్సలాట్‌ ల్యాబ్స్‌ అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

‘సాహో’ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.