Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146075
            [news_title_telugu_html] => 

మెగాస్టార్‌.. రఫ్ఫాడించేయండి

[news_title_telugu] => మెగాస్టార్‌.. రఫ్ఫాడించేయండి [news_title_english] => wishes pour in for megastar chiranjeevi [news_short_description] => మెగాస్టార్‌ చిరంజీవి ఈరోజు తన 64వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 11:30:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మెగాస్టార్‌.. రఫ్ఫాడించేయండి - wishes pour in for megastar chiranjeevi - EENADU
close

తాజావార్తలు

మెగాస్టార్‌.. రఫ్ఫాడించేయండి

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు తన 64వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్‌, చిరంజీవి అనే హ్యాష్‌ట్యాగ్స్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఆయన నిండు నూరేళ్లు చిత్ర పరిశ్రమను ఇలాగే రఫ్ఫాడించేయాలంటూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రామ్‌చరణ్‌: మీరు మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఓ మెంటార్‌గా నాతో పాటు లక్షలాది మందిని గైడ్‌ చేశారు. వారంతా మిమ్మల్ని మెగాస్టార్‌ అంటారు. నేను మిమ్మల్ని అప్పా అని పిలుస్తాను. హ్యాపీ బర్త్‌డే అప్పా. లవ్యూ.

చంద్రబాబునాయుడు: స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

రాధిక: మీరు మరింత సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు.
సుధీర్‌బాబు: ఇటీవల ఆయన దిగిన ఫొటోషూట్‌ చూశాను. అసలు వయసైనట్లు ఏమాత్రం కనిపించడంలేదు. హ్యాపీ బర్త్‌డే లెజెండ్.
గోపీచంద్‌ మలినేని: మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా కోసం ఆయన కష్టపడేతత్వం, డెడికేషన్‌ ఎందరికో స్ఫూర్తిదాయకం. ‘సైరా’లో ఆయన స్టైల్‌ను చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
తమన్‌: మన అభిమాన హీరో పట్ల మనం చూపే ప్రేమలో నిజాయతీ ఉంటే.. ప్రతిఫలం మరోలా ఉంటుంది. ఆయనే నా ఫస్ట్‌ లవ్‌.

సురేందర్‌ రెడ్డి: ఎవర్‌గ్రీన్‌ స్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు.
మంచు మనోజ్‌: మీ చెయ్యి ఇంకా రఫ్‌గా ఉంది. ‘సైరా’తో మళ్లీ రఫ్‌ ఆడించేయండి. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌.
దేవిశ్రీ ప్రసాద్‌: మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రణీత: మన మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలి.

ప్రదీప్‌ మాచిరాజు: మీ సినీ జర్నీ మాలాంటి వారెందరికో స్ఫూర్తిదాయకం. పుట్టినరోజు శుభాకాంక్షలు సర్‌.
అవసరాల శ్రీనివాస్‌: హ్యాపీ బర్త్‌డే సర్‌. మాలో ఇలా స్ఫూర్తినింపుతూనే ఉండండి.
శ్రీనివాస్‌రెడ్డి: ప్రతిభకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందరికో మార్గదర్శి మన మెగాస్టార్‌.
వెంకీ కుడుముల: నా జీవితంలో ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మీ పక్కన నిలబడే అవకాశం వచ్చినందుకు నేనెంతో అదృష్టవంతుడిని.
శ్రీనువైట్ల: హ్యాపీబర్త్‌డే మెగాస్టార్‌. ఆయన నిబద్ధత ఎందరికో స్ఫూర్తిదాయకం. సైరా సినిమా కోసం ఎదురుచూస్తుంటాను.
హంసానందిని: ఆయన్ని తెరపై చూసిన ప్రతీసారి ఎగ్జైట్‌ అవుతుంటా. హ్యాపీ బర్త్‌డే చిరు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.