Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146743
            [news_title_telugu_html] => వెండితెరపై బాలాకోట్‌ దాడులు
            [news_title_telugu] => వెండితెరపై బాలాకోట్‌ దాడులు
            [news_title_english] => Vivek Oberoi to star in film on Balakot air strikes
            [news_short_description] => జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఉగ్రవాదులు దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో గల ఉగ్ర శిబిరాలపై భారత్‌ వాయుదాడులు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 15:12:17
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వెండితెరపై బాలాకోట్‌ దాడులు - Vivek Oberoi to star in film on Balakot air strikes - EENADU
close

తాజావార్తలు

వెండితెరపై బాలాకోట్‌ దాడులు

వివేక్‌ ఒబెరాయ్‌ నిర్మాణంలో మూడు భాషల్లో  

ముంబయి: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఉగ్రవాదులు దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ వాయుదాడులు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మిరాజ్‌ యుద్ధ విమానాలతో బాలాకోట్‌పై విరుచుకుపడిన భారత వాయుసేన ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ చర్యతో ఉగ్రవాదాన్ని సహించేది లేదంటూ దాయాది దేశం పాక్‌కు భారత్‌ గట్టి హెచ్చరికలు చేసింది. కాగా.. ప్రస్తుతం ఆ కీలక ఘట్టాలు వెండితెరపై ఆవిష్కృతం కానున్నాయి. బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో త్వరలో సినిమా రాబోతోంది. 

టైటిల్‌ ఏంటంటే..

‘బాలాకోట్‌-ది ట్రూ స్టోరీ’ పేరుతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పుల్వామా దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, వ్యూహాత్మక చర్యలు, వాయుసేన ధైర్యసాహసాలు తదితర అంశాలను ఇందులో చూపించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీగా వెండితెరపై అలరించిన ప్రముఖ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. సినిమాలో ఆయన కూడా నటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని అనుమతులను వివేక్‌ తీసుకున్నారట. ఈ ఏడాది చివరి నుంచి షూటింగ్‌ మొదలుపెట్టాలని వివేక్‌ భావిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌, దిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. త్వరలోనే నటీనటులు, దర్శకుడి వివరాలను ప్రకటించనున్నారు.

అభినందన్‌ పాత్ర కూడా..

బాలాకోట్‌ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ మరుసటి రోజే పాక్‌ భారత్‌పై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే పాక్‌ విమానాలను తరిమికొట్టే క్రమంలో వింగ్‌ కమాండర్‌ అభిందన్‌ వర్ధమాన్‌ నడుపుతున్న విమానం కూలి ఆయన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పడ్డారు. దీంతో పాక్‌ సైనికులు ఆయనను బంధీగా తీసుకున్నారు. మూడు రోజుల పాటు శత్రువుల చెరలో ఉన్నప్పటికీ ఏ క్షణంలోనూ ధైర్యాన్ని వీడని అభినందన్‌ పాత్రను కూడా ఈ సినిమాలో చూపించనున్నట్లు వివేక్‌ ఒబెరాయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

పౌరుడిగా ఇది నా బాధ్యత..

ఈ సందర్భంగా వివేక్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.. ‘భారతీయుడిగా, దేశభక్తి కలిగిన వ్యక్తిగా మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను ప్రజలకు చాటి చెప్పడం నా బాధ్యత. అభినందన్‌ లాంటి ధైర్యమైన అధికారులను, మన సైన్యం విజయాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. పుల్వామా దాడి నుంచి బాలాకోట్‌ వాయు దాడుల వరకు ప్రతిదీ నేను వార్తల్లో చూసి తెలుసుకున్నాను. ఆ సమయంలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. వాటికి ఈ సినిమా సమాధానాలు ఇస్తుంది. మాపై నమ్మకం ఉంచి సినిమా చేసేందుకు అనుమతి ఇచ్చిన వాయుసేనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సినిమాను మేం పూర్తి న్యాయం చేస్తామని విశ్వాసంగా ఉన్నాం’ అని తెలిపారు.  
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.