Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119008863
            [news_title_telugu_html] => 

చిరంజీవి.. రవితేజ తర్వాత అలాంటి వ్యక్తి నాని

[news_title_telugu] => చిరంజీవి.. రవితేజ తర్వాత అలాంటి వ్యక్తి నాని [news_title_english] => karthikeya at Nani Gang Leader Pre Release Event [news_short_description] => ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా యాక్టర్‌ అవుదామనుకునే నేటి తరం యువతకు నానినే స్ఫూర్తి అని యువ కథానాయకుడు కార్తికేయ అన్నారు.  నాని హీరగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => jCem9mmL07Y [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 00:08:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చిరంజీవి.. రవితేజ తర్వాత అలాంటి వ్యక్తి నాని - karthikeya at Nani Gang Leader Pre Release Event - EENADU
close

తాజావార్తలు

చిరంజీవి.. రవితేజ తర్వాత అలాంటి వ్యక్తి నాని

విశాఖపట్నం: ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా యాక్టర్‌ అవుదామనుకునే నేటి తరం యువతకు నానినే స్ఫూర్తి అని యువ కథానాయకుడు కార్తికేయ అన్నారు.  నాని హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ఇందులో కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. విశాఖపట్నంలో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘మీలాగే నేను కూడా నానికి పెద్ద ఫ్యాన్‌ని. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చే వారికి స్ఫూర్తిగా కొన్ని పేర్లు కనపడతాయి. మొదటి పేరు మెగాస్టార్‌ చిరంజీవిగారు. ఆ తర్వాత రవితేజగారు. కానీ, వాళ్లు వచ్చి చాలా కాలం అయింది. నాలాంటి యువతకు ఇంట్లో చెప్పడానికి ఒక పేరు కావాలి. మాకు కూడా నమ్మకం కలగడానికి ఒక పేరు కావాలి. చిరంజీవిగారి పేరు చెబితే, ‘ఆయన ఎప్పుడో వచ్చారు. సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు?’ అని అంటే.. అప్పుడు మాకు కనిపించే పేరు ‘నాని గారు’. ప్రతి విషయంలోనూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి నేడు ‘నేచురల్‌ స్టార్‌’ అని పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఎన్ని బ్లాక్‌ బస్టర్స్‌ వచ్చినా సరే, తను నమ్మిన కథలనే చేస్తారు. నా జీవితంలో నేను ఏస్థాయికి వెళ్తానో తెలియదు కానీ, నా జీవితంలో గుర్తిండిపోయే సినిమా ఇది. మీతో(నాని) మరిన్ని సినిమాలు చేయాలి. విక్రమ్‌గారు ఎలాంటి సినిమాలు తీస్తారో మనం చూశాం. ఆయన సినిమాలో పనిచేయడం నా అదృష్టం. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత నేను నటించే పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా నుంచి కొత్త కార్తికేయను చూస్తారు. మైత్రీ మూవీమేకర్స్‌ నుంచి మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రం అవుతుంది’’అని అన్నారు. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.