Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009327
            [news_title_telugu_html] => 

ప్రభాస్‌ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా!

[news_title_telugu] => ప్రభాస్‌ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా! [news_title_english] => fan climbs cell tower to demand meeting with prabhas [news_short_description] => కథానాయకుడు ప్రభాస్‌ తనను కలవడానికి రావాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. జనగామ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణ ఇంఛార్జ్‌ సీఐ సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం తొమ్మిది.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 110906-prabhas.mp4 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 00:15:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రభాస్‌ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా! - fan climbs cell tower to demand meeting with prabhas - EENADU
close

తాజావార్తలు

ప్రభాస్‌ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా!

సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

జనగామ పట్టణం: కథానాయకుడు ప్రభాస్‌ తనను కలవడానికి రావాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. జనగామ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణ ఇంఛార్జ్‌ సీఐ సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వెంకన్న హన్మకొండ రహదారి పక్కనున్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. అతడ్ని గమనించిన స్థానికులు కిందికి దిగమని కోరగా.. ససేమిరా అన్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడ్ని కిందికి దిగమని కోరగా.. హీరో ప్రభాస్‌ ఇక్కడికి వస్తేనే దిగుతానని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. అలా దాదాపు నాలుగు గంటలపాటు టవర్‌పైనే హల్‌చల్‌ చేశాడు. డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌ కుమార్‌ టవర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎట్టకేలకు పోలీసులు, స్థానికుల విజ్ఞప్తి మేరకు వెంకన్న టవర్‌ దిగి, కిందికి వచ్చాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.