close

తాజావార్తలు

అప్పుడు శ్రీదేవి-శోభన్‌బాబు.. ఇప్పుడు పూజా-వరుణ్‌

‘ఎల్లువచ్చి గోదారమ్మ’ మేకింగ్‌ వీడియో చూశారా..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ యువ కథానాయకుడు, మెగా హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీశ్‌శంకర్‌ ఈ సినిమానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ‘దేవత’ సినిమాలోని హిట్‌ సాంగ్‌ ‘ఎల్లువచ్చి గోదారమ్మ’ను ఈ సినిమాలో రీమేక్‌ చేస్తున్నారనే విషయం తెలిసిందే. వరుణ్‌, పూజా మీద చిత్రీకరించిన ఈ పాట మేకింగ్‌ వీడియోను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో వరుణ్‌ శోభన్‌బాబులాగా.. పూజా శ్రీదేవిలాగా కనిపించారు. వీరిద్దరి నృత్యానికి దర్శకుడు సైతం ఫిదా అయిపోయారు.

ముకుంద చిత్రం తర్వాత వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే.మేయర్‌ ఈ సినిమానికి బాణీలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలనాటి నటీనటులు శ్రీదేవి, శోభన్‌బాబు కలిసి నటించిన చిత్రం ‘దేవత’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1982లో వచ్చిన ఈ సినిమాలోని ‘వెల్లువచ్చి గోదారమ్మ’ పాట ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో హత్తుకుంది. గోదారి ఒడ్డున బిందెల మధ్యలో శ్రీదేవి, శోభన్‌బాబు మీద చిత్రీకరించిన ఈ పాటకు వారిద్దరి నృత్యంతోపాటు అందం, అభినయం ప్రాణం పోశాయి.


 




Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.