close

తాజావార్తలు

తమన్నా.. తగ్గట్లేదుగా..!

కోడంబాక్కం, న్యూస్‌టుడే: కోలీవుడ్‌లో ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. నయనతార, త్రిషలతో పాటు హన్సిక, తమన్నా, ఇతర కథానాయికలు కొందరు కథానాయిక ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుని నటిస్తున్నారు. అందులో భాగంగా తమన్నా ‘పెట్రోమాక్స్‌’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యోగిబాబు ముఖ్యపాత్ర  పోషిస్తున్నారు. తెలుగులో విజయం సాధించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రానికి రీమేక్‌ ఇది. రోహిన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని ఈగల్‌ ఐ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై కుమార్‌ నిర్మిస్తుండగా తాప్సీ పాత్రలో తమన్నా నటిస్తోంది. జిబ్రాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఇప్పటికే దీపావళి రేసులో విజయ్‌ నటించిన ‘బిగిల్‌’, కార్తి హీరోగా చేసిన ‘ఖైది’, విజయ్‌ సేతుపతి నటించిన ‘సంగ తమిళన్‌’ చిత్రాలు విడుదల కానున్నట్లు ఆయా చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ మూడు సినిమాలకే థియేటర్ల కొరత వచ్చే అవకాశముంది. కలెక్షన్లపై ప్రభావం చూసే అవకాశముందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమన్నా కూడా పోటీలోకి దిగడం రసవత్తరంగా మారింది. కానీ దీపావళి రోజున ఇన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి రేసులో నుంచి ఎవరు తప్పుకుంటారో.. ఎవరుంటారో వేచి చూడాలి. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.