close

తాజావార్తలు

నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌..!

‘ఖైదీ’ తెలుగు ట్రైలర్‌ విడుదల

చెన్నై: తమిళ నటుడు కార్తీ నటించిన చిత్రం ‘ఖైదీ’. విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ క్రమంలో సోమవారం ‘ఖైదీ’ సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ.. ‘పాటలు, రొమాన్స్‌లేని యాక్షన్‌ను ఎంజాయ్‌ చేయండి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో ‘దిల్లీ’ అనే ఖైదీ పాత్రలో కార్తీ నటించారు. ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు కదా సార్‌‌’ అని కార్తీ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ యాక్షన్‌ ప్రియులను అలరించే విధంగా ఉంది. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.