close

తాజావార్తలు

ఆ బుడ్డోడే.. నేటి సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ

హీరో సోషల్‌ లైఫ్‌లో ఎన్నెన్నో విశేషాలు..!

అప్పటి వరకు అతడు ఓ సాధారణ నటుడు. బ్రేక్‌ కోసం ఆరేళ్లుగా చిత్ర పరిశ్రమలో కష్టపడుతున్న కుర్రాడు. 2017 ఆగస్టు 25న ఎట్టకేలకూ అతడి కల నిజమైంది. ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా నేషనల్‌ సెన్సేషన్‌ అయిపోయాడు. ఎంతగా అంటే అతడి పేరు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మార్మోగిపోయింది. అతను ఎవరో కాదు.. కుర్రకారులో ఎనలేని క్రేజ్‌ సంపాదించుకున్న యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఇదంతా అతనికి ఒక్కరోజులో వచ్చిన ఫేమ్‌ కాదండీ. ఎన్నో ఆడిషన్స్‌.. తిరస్కారాలు.. నిరాశల తర్వాత ఈ స్టార్‌డమ్‌ దక్కింది. నేడు అతను ఓ స్టార్‌ హీరోగా మంచి దూకుడు మీద ఉన్నారు. కథలు ఆయన్ను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. అలాంటి స్టార్‌ విజయ్‌ సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. మరి ఆయన సామాజిక మాధ్యమాలను ఓసారి తిరగేస్తే...

ఫాలో కావడంలేదు..

2014లో విజయ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచారు. ప్రస్తుతం ఆయన్ను 12 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. 2017లో ‘అర్జున్‌రెడ్డి’ విడుదలైన నెలలోనే విజయ్‌ ట్విటర్‌ ఖాతా ప్రారంభించారు. ఇప్పుడు ఆయన్ను 9.96 లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. కానీ విజయ్‌ మాత్రం ట్విటర్‌లో ఒక్కర్ని కూడా ఫాలో కాకపోవడం గమనార్హం. 2018 మార్చి 7న విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ఇక్కడ ఆయన్ను 4.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. విజయ్‌ ఇన్‌స్టాలోనూ ఒక్కర్ని కూడా అనుసరించడం లేదు.

ఓ మంచి కోసం..

‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’కు విరాళాలు సేకరించేందుకు విజయ్ గత ఏడాది మార్చిలో ముందుకొచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన షోలో ఆయన పాల్గొన్నారు. ‘‘గుడ్‌ కర్మ.. వాక్‌.. స్మైల్‌.. విరాళాలు.. ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ కోసం డబ్బులు సేకరిస్తున్నాం. పిల్లల మంచి భవిష్యత్తు కోసం వీటిని ఉపయోగించబోతున్నాం. మీరు దీన్ని బాధ్యతగా ఫీలైతే.. www.teachforchange.in వెబ్‌సైట్‌ చూడండి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.

ఫేవరెట్‌ మెన్‌..

లనాటి తార సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో విజయ్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో విజయ్‌తోపాటు ఎన్టీఆర్‌, దుల్కర్‌ సల్మాన్‌, నాని సందడి చేశారు. నలుగురూ పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను విజయ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘నాకు బాగా ఇష్టమైన వారిలో కొందరు..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

చిరునవ్వు చూడాలని..

త ఏడాది మే 8న విజయ్‌ పుట్టినరోజున హైదరాబాద్‌ వాసుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. అది వేసవి కావడంతో బర్త్‌డే రోజున స్వయంగా ఐస్‌క్రీమ్‌లు పంచారు. ‘రేపు మే 9. వేసవి కాబట్టి ఎండగా ఉంది. కానీ నా పుట్టినరోజు కాబట్టి నాకు సంతోషంగా ఉన్న ముఖాల్ని చూడాలని ఉంది. అందుకే హైదరాబాద్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలి అనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత స్వయంగా ఐస్‌క్రీంలు పంచారు. ఓ రోజు ఎండలో షూటింగ్‌ చేస్తుండగా తనకు ఈ ఆలోచన వచ్చినట్లు చెప్పారు. ఇలా విభిన్నంగా ఆలోచించే ఆయన స్వభావమే అభిమానుల్ని మరింత దగ్గర చేసిందనడంలో ఆశ్చర్యం లేదు.

రౌడీ పేరు కాదు.. ఒక బ్రాండ్‌

టుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత విజయ్‌ ‘రౌడీ’ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను స్థాపించారు. దీనికి ఆయనే ప్రచారకర్తగా ఉంటూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ బ్రాండ్‌ యువతను బాగా ఆకర్షిస్తోంది.

తొలి అవార్డు ఇచ్చేశారు..

‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు. కానీ, ఈ అవార్డును ఆయన మంచి పనికోసం ఉపయోగించారు. ‘ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాను. కానీ నాకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నప్పుడే నేను గెలిచేశా. ఆ తర్వాత ఇండస్ట్రీ నాకు గౌరవం, డబ్బు ఇచ్చినప్పుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. అమ్మానాన్నలకు సొంతిల్లు కొన్నప్పుడు మరోసారి విజయం సాధించా. అభిమానులు నాపై ప్రేమ, అభిమానం కురిపించినప్పుడు మళ్లీ గెలిచినట్లు అనిపిస్తోంది. ఈ అవార్డు ఒక బోనస్‌. నేను అందుకున్న తొలి అవార్డును వేలం వేస్తే దాని ద్వారా వచ్చే డబ్బు ఇతరులకు సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడే నేను అందుకున్న ఈ తొలి అవార్డుకు విలువ ఉంటుంది’ అంటూ విజయ్‌ అప్పట్లో అవార్డు వేలం వేశారు. దీని ద్వారా వచ్చిన రూ.25 లక్షల మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.

ఇంటికెళ్లిన కేటీఆర్‌..

మంత్రి కేటీఆర్‌ గత ఏడాది జూన్‌లో విజయ్‌ ఇంటికి వెళ్లారు. ఆయనతో కలిసి కాసేపు సమయం గడిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని విజయ్‌ ఇన్‌స్టాలో పంచుకున్నారు. తనకు ఇష్టమైన నాయకుడు తన ఇంటికి భోజనం చేయడానికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో హైదరాబాద్‌లో రోడ్లు, నీటి సంరక్షణ, చేనేత వస్త్రకళ తదితర విషయాలతోపాటు కుటుంబ సభ్యుల గురించి ముచ్చటించినట్లు తెలిపారు.

కేరళ కోసం..

కేరళను వరదలు ముంచెత్తినప్పుడు విజయ్‌ తనవంతుగా సహాయం చేశారు. రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు. మిగిలిన వారు కూడా తమకు తోచిన సహాయం చేయాలని ఈ సందర్భంగా విజయ్‌ కోరారు. విహారయాత్రకు వెళ్లాలనిపించినప్పుడు కేరళకు వెళ్తుంటానని, అక్కడివారు చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటారని గుర్తు చేసుకున్నారు.

ఆ స్థాయి నుంచి ఇక్కడికి..

‘మహర్షి’ సినిమా సెట్‌లో మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లిని విజయ్‌ కలిశారు. ఒకప్పుడు మహేశ్‌ సినిమా టికెట్ల కోసం కొట్టుకునే వాళ్లమని.. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి సమయం గడిపే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఏదీ సులభంగా కాదు..

‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా షూట్‌లో విజయ్‌ చేతికి స్వల్పగాయమైంది. గత ఏడాది డిసెంబరులో ఆయన గాయంతో కూడిన ఫొటోను షేర్‌ చేశారు. ‘మీరు గాయపడ్డందుకు ఆనందించండి. ఎందుకంటే.. జీవితంలో ఏదీ సులభంగా రాదు’ అని ఆయన ఫాలోవర్స్‌కు సందేశం ఇచ్చారు.

ఫోర్బ్స్‌లో చోటు..

విజయ్‌ ఈ ఏడాది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2019 ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్‌ 30’లో చోటు దక్కించుకున్నారు. భారత్‌లో 30 ఏళ్ల కన్నా తక్కువ వయసు కలిగి, తమ తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చినవారి జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. నటుడిగా విజయ్‌ ఈ ఖ్యాతి దక్కించుకు‌న్నారు.

ఒకే రోజు..

‘గీతా గోవిందం’ సినిమాకుగానూ విజయ్‌ సైమా ఉత్తమ నటుడు క్రిటిక్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంలో ఆయన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఆగస్టు 15, 2018 ‘గీతా గోవిందం’ విడుదలైంది. ఆగస్టు 15న ‘గీతా గోవిందం’కు గానూ అవార్డు తీసుకున్నా’ అని ఆయన పోస్ట్ చేశారు.

ఈ బుడ్డోడే విజయ్‌..

టుడిగా విజయ్‌ తొలి సినిమా ‘నువ్విలా’. కానీ ఆయన పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ‘శిరిడిసాయి ప్రతి సాయి దివ్య కథ’ సీరియల్‌లో నటించారు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై విజయ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘ఈ చిన్నవాడు ఇప్పటి స్టార్‌ అంటూ నా చిన్నప్పటి వీడియో ట్రెండ్‌ అవుతోంది. నేనూ దీన్ని మరొకరి వల్ల చూశా. మా అమ్మ, నేను ఇది చూసిన తర్వాత చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాం. పాత రోజులు గుర్తొచ్చాయి. చిన్నతనంలో నా వాయిస్‌ వింటుంటే చాలా బాగుంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.