close

తాజావార్తలు

రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో..

‘అల.. వైకుంఠపురములో..’ నుంచి కొత్త పాట

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ సినిమా నుంచి కొత్తపాట టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. ‘రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో.. రాములో రాములా నా పాణం తీసిందిరో..’ అంటూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్‌, పూజా హెగ్డే కలిసి ఓ పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ఈ పూర్తి పాటను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా యూట్యూబ్‌లో అత్యధికంగా లైక్‌ చేసిన పాటగా రికార్డు సృష్టించింది.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘అల.. వైకుంఠపురములో..’. పూజా హెగ్డే కథానాయిక. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటి టబు ఈ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులోని ఓ ప్రత్యేక గీతంలో కథానాయిక కాజల్‌ ఆడిపాడనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.