
తాజావార్తలు
హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రానికి సంబంధించి మరో టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి మూడోపాట టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా గురువారం విడుదల చేసింది. ‘ఓ మైగాడ్ డాడీ’అంటూ సాగే ఈ పాట టీజర్లో బన్నీ కుమారుడు అల్లు అయాన్‌తోపాటు కుమార్తె అల్లు అర్హ ముద్దుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బన్నీ సర్ప్రైజ్ చాలా క్యూట్‌గా ఉందని సినీ అభిమానులు అంటున్నారు. ‘ఓ మై గాడ్ డాడీ’ పూర్తి పాటను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’.. పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఇప్పటికే ‘దువ్వాడ జగన్నాథ్’తో మంచి హిట్ అందుకున్న పూజా-బన్నీ జంట ఈ చిత్రంతో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ చిత్రంలో కాజల్ ఓ ప్రత్యేక గీతంలో తళుక్కుమననున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- సినిమా పేరు మార్చాం
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత