
తాజావార్తలు
స్పెషల్ కట్‌తో ‘జార్జిరెడ్డి’ వీడియో సాంగ్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కోసం ఓ ప్రత్యేక వీడియో సాంగ్‌ను ‘జార్జిరెడ్డి’ చిత్రబృందం విడుదల చేసింది. ‘హే.. సమరం మనది అయితే.. విజయం మనదే కదా. కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా.’ అంటూ సాగే ఈ పాటకు పవన్‌కల్యాణ్ రాజకీయ ప్రయాణాలకు సంబంధించిన కొన్ని వీడియోలతో దీనిని రూపొందించారు. ఈ స్పెషల్ వీడియోను సోషల్‌మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘‘విజయం’ పాట స్పెషల్ కట్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు అంకితం చేస్తున్నాం.’ అని చిత్రబృందం పేర్కొంది.
1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా ఎదిగిన జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘జార్జిరెడ్డి’. టైటిల్ పాత్రలో వంగవీటి ఫేమ్ సందీప్ కుమార్ నటిస్తున్నారు. జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అప్పిరెడ్డి నిర్మాత. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.